AP NIT: 27 నుంచి నిట్ విద్యార్థులకు తరగతులు
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో చేరిన తొలి ఏడాది విద్యార్థులకు ఈ నెల 27 నుంచి తరగతులు నిర్వహించనున్నట్టు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జీబీ వీరే‹Ùకుమార్, అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ టి.కురుమయ్య మంగళవారం తెలిపారు. పశి్చమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌లో 750 సీట్లుండగా.. 716 మంది విద్యార్థులు చేరినట్లు పేర్కొన్నారు. అలాగే ఏపీ నిట్‌లో చేరిన విద్యార్థులకు ఇండక్షన్(ప్రేరణ) కార్యక్రమం బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిట్ గొప్పదనం, బోధించే అంశాలు, క్రీడలు, ఉద్యోగావకాశాలు, కెరీర్ తదితరాలపై రోజుకొక అతిథి విద్యార్థులకు వివరిస్తారు.
College Fee: ఇంజినీరింగ్ కాలేజీలు మరో 15% ఫీజులు పెంపు !
పలు పోస్టులకు 18న పరీక్ష..
నిట్‌లోని పలు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 18న పరీక్షలు నిర్వహించనున్నారు. జూనియర్ అసిస్టెంట్ పార్ట్–బి పరీక్షకు 40 మంది హాల్‌టికెట్లు పొందారు. వీరు 18వ తేదీ ఉదయం 8.30కి హాజరుకావాల్సి ఉంటుంది. ఎస్‌ఏఎస్ అసిస్టెంట్ పరీక్షకు పది మంది హాల్‌టికెట్లు పొందారు. వీరు 18వ తేదీ ఉదయం 7.30కి నిట్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఏఎస్ ఆఫీసర్ పోస్టు కోసం పది మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరంతా హాల్‌టికెట్లు, ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డులతో హాజరుకావాలని అధికారులు తెలిపారు.
Click here for more Education News