భవన నిర్మాణాలకు అనుమతిలేని ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపు వచ్చేనా?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు మళ్లీ కష్టకాలం వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వాటికి గుర్తింపు వస్తుందో.. లేదోనన్న..? ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలోని ఆయా కాలేజీలకు భవన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా భవనాలను నిర్మించి కొనసాగిస్తున్నాయి. ఈ అంశంపై రెండేళ్ల కిందట (2017 నవంబర్‌లో) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ యాజమాన్యాలకు ఏఐసీటీఈ నోటీసులు జారీ చేసింది. యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అనుమతి పత్రాలు ఇస్తేనే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు గుర్తింపు ఇస్తామని స్పష్టం చేసింది. చివరకు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏఐసీటీఈ ఆ కాలేజీలకు మినహాయింపును ఇచ్చింది. రెండేళ్లలో అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అయినా యాజమాన్యాలు ఇప్పటికీ అనుమతులు తీసుకోలేదు.
ముగిసిన గడువు.. మళ్లీ నోటీసులు..
గతంలో యాజమాన్యాలు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఏఐసీటీఈ నిరాకరించడం, దానివల్ల రాష్ట్రంలో 238 కాలేజీల్లో ప్రవేశాలు ఆగిపోతే మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఏఐసీటీఈకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంతో రెండేళ్లపాటు మినహాయింపు ఇచ్చింది. ఆ కాలేజీలకు ఇచ్చిన గడువు గత నెలతోనే ముగిసిపోవడంతో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేసింది. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో తమ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తుందా? లేదా? అన్న ఆందోళనలో పడ్డాయి. గతంలోనే తాము అడిగితే మినహాయింపును ఏఐసీటీఈ నిరాకరించిన నేపథ్యంలో ఈసారి తమ విజ్ఞప్తిని పట్టించుకుంటుందో లేదోనన్న ఆందోళనతో మళ్లీ ప్రభుత్వాన్ని కలసి విజ్ఞప్తి చేసేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ఇప్పటికే ఒకసారి గడు వు ఇచ్చినందునా ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం రెండో సారి అడిగితే ఏఐసీటీఈ ఇస్తుందా? లేదా? అన్న ఆందోళన కూడా యాజమాన్యాల్లో నెలకొంది.
లేఖ రాసినా.. నో స్పందన..
ఆ 238 కాలేజీల స్థలాలు, భవనాలు, ఇతర అనుమతుల పత్రాలను తనిఖీ చేసి అక్టోబర్‌లోపు నివేదిక అందించాలని ఏఐసీటీఈ గత ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అది ఆ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించింది. ఇంతవరకు కనీసం వాటిని తనిఖీ చేయలేదు. చివరకు ఆ బాధ్యతను జేఎన్టీయూకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది. దీంతో సంబంధిత అనుమతి పత్రాలను అందజేయాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ లేఖలు రాసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది.
హెచ్ఎండీఏలోనే అధికం..
అనుమతులు లేకుండా కొనసాగుతున్న కాలేజీల్లో ఎక్కువ శాతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. వాటిల్లోనూ 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 42 కాలేజీలు ఉన్నాయి. 238 కాలేజీల్లో కొన్ని కాలేజీలు గ్రామ పంచాయతీ అనుమతితో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాయి. కొన్ని కాలేజీలు ల్యాండ్ కన్వర్షన్ చేసుకోకుండానే వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేశాయి. మరికొన్ని కాలేజీలకు హెచ్ఎండీఏ అనుమతులు లేవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భవన నిర్మాణ అనుమతులు తీసుకోని కాలేజీలూ ఉన్నాయి. అంతేకాదు 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో, ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో, అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టాయి. ఇప్పుడు వాటన్నింటికి సమస్య మళ్లీ ముందుకొచ్చింది. రెండేళ్ల గడువు ఇచ్చినా యాజమన్యాలు సరిదిద్దుకోలేదు.

Published date : 16 Dec 2019 05:14PM