Skip to main content

బీటెక్‌లో ఓపెన్‌బుక్ పరీక్ష విధానం

సాక్షి, హైదరాబాద్: బీటెక్‌లో ఇక ఓపెన్‌బుక్ పరీక్షా విధానం అమల్లోకి రానుంది. మానవ వనరుల అభివృధ్ధి శాఖ ఓపెన్‌బుక్ పరీక్షల విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆమోదం తెలిపింది.
అవుట్ కం బేస్డ్ ఎడ్యుకేషన్ కోసం చర్యలు చేపడుతున్న ఏఐసీటీఈ తాజాగా ఈ విధానానికి ఓకే చెప్పడంతో వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. పరీక్షా విధానంలో విద్యార్థులు బట్టీ పట్టేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఈ కొత్త విధానం ద్వారా బట్టీకి ఫుల్‌స్టాప్ పడనుంది. అయితే ఓపెన్‌బుక్ పరీక్షల్లో ప్రశ్నల సరళిని మార్చాల్సి ఉంటుందని నివేదిక అందజేసిన నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రస్తుతం పరీక్షల్లో పదిహేను ప్రశ్నల వరకు ఇస్తుండగా, వాటిని నాలుగైదు ప్రశ్నలకు పరిమితం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఈ ప్రశ్నలు నేరుగా సమాధానం రాసేలా కాకుండా విశ్లేషించి విద్యార్థులు ఆలోచించి సృజనాత్మకంగా రాసేలా ఉండాలని, పరీక్ష సమయాన్ని పెంచాలని సూచించింది. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పుడు విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ను 600 గంటల నుంచి 700 గంటలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
Published date : 24 Nov 2018 01:53PM

Photo Stories