బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.. పీపీఈ కిట్‌తో ఇన్విజిలేషన్!
Sakshi Education
అనంతపురం విద్య: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.
తొలిరోజు ఈసీఈ, ఈఈఈ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలకు వర్సిటీ పరిధిలోని వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం 7,522 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కోవిడ్ పాజిటివ్ విద్యార్థులు 25 మంది ఉన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ఆర్.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ పీపీఈ కిట్ ధరించి పర్యవేక్షించారు.
Published date : 04 Sep 2020 02:21PM