బీటెక్ అడ్మిషన్లలో అమ్మాయిలకు 25 శాతం సీట్లు!
Sakshi Education
రాయదుర్గం: అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల మధ్య లింగ నిష్పత్తిని మెరుగుపర్చేందుకు సానుకూల చర్యలను తీసుకోవాలని ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ నిర్ణయించింది.
దీనిలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరంలో జేఈఈ మోడ్ ఆధారంగా బీటెక్ కోర్సులో (నాలుగేళ్లు) అడ్మిషన్లు కల్పించే సమయంలో 25 శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అలాగే విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు ఇవ్వడం, ట్యూషన్ ఫీజు పాక్షిక మాఫీ వంటివి చేయాలని భావిస్తోంది. దరఖాస్తు రుసుము విషయంలో కూడా విద్యార్థినులకు పాక్షిక/పూర్తి మాఫీ చేయాలనే అంశాన్ని పరిశీలిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 19ని ఆఖరు తేదీగా నిర్ణయించింది. మరిన్ని వివరాలకు https://www. iiit.ac.in/admissions/undergraduate ను సంప్రదించవచ్చు.
Published date : 28 Jan 2020 02:52PM