బాసర ఐటీకి ఆసియా ఎడ్యుకేషన్ అవార్డు
Sakshi Education
బాసర (ముథోల్): నిర్మల్ జిల్లా బాసర లోని ట్రిపుల్ ఐటీకి అంతర్జాతీయ స్థాయిలో ఆసియా ఎడ్యుకేష¯Œన్ అవార్డు లభించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును కళాశాల వైస్ చా¯Œన్సలర్ అశోక్ తరఫున కళాశాల ప్రతినిధి శివరాం మల్లెల అందుకున్నారు.
ట్రిపుల్ ఐటీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక, సై¯Œన్స్ విద్య అందిస్తున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి నేటి వరకు కళాశాల విద్యార్థులకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. అందుకనుగుణంగా విద్యార్థులూ మెరికల్లా రాణిస్తున్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్య, అత్యున్నత ప్రయోగశాలలు, వివిధ సంస్థల ద్వారా ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఫలితంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత విలువ కలిగిన విద్యను యూనివర్సిటీ నుంచి అందుకుంటున్నట్లు ప్రతినిధి శివరాం పేర్కొన్నారు.
Published date : 14 Dec 2019 05:02PM