Skip to main content

UGC: ఆర్‌ఎస్సార్‌కు అటానమస్‌ హోదా

బిట్రగుంట: బోగోలు మండలం కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన అటానమస్‌ (స్వయం ప్రతిపత్తి) హోదా లభించింది.
Autonomous status for RSS
ప్రిన్సిపల్‌ను సన్మానిస్తున్న అధ్యాపక బృందం

ఢిల్లీకి చెందిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) పది సంవత్సరాలపాటు అటానమస్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరస్పాండెంట్‌ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సెప్టెంబ‌ర్ 27న వివరాలు తెలిపారు. కళాశాలలో ఉత్తమ విద్యా ప్రమాణాలు అవలంభిస్తున్నందుకు ఈ ఏడాది మార్చిలో యూజీసీ నాక్‌–ఏ గ్రేడ్‌ మంజూరు చేసిందన్నారు.

చదవండి: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ‘బైట్‌ బైండింగ్‌ చాంపియన్‌షిప్‌’

అటానమస్‌ హోదాతో సొంత పాఠ్యప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం, పరీక్షలు నిర్వహించడం, డిగ్రీలు ప్రదానం చేయడం సహా విద్యా ప్రమాణాలను, కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మరిన్ని సదుపాయాలను కల్పించేందుకు వీలుంటుందని వివరించారు. కళాశాలకు ప్రతిష్టాత్మకమైన అటానమస్‌ హోదా లభించడంతో అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాజారెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీఎన్‌ రెడ్డి, పరిపాలనాధికారి ఆర్వీ రమణారెడ్డి, అన్నీ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Published date : 28 Sep 2023 04:04PM

Photo Stories