Skip to main content

అనుబంధ కాలేజీలన్నీ ప్రఖ్యాత కోర్సులను అందించండి: జేఎన్‌టీయూ

సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థల ఆన్‌లైన్ కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉంచాయని, వాటిని విద్యార్థులు సద్వినియోగపరచుకునేలా అనుబంధ కాలేజీలన్నీ ఏర్పాట్లు చేయాలని జేఎన్‌టీయూ సూచించింది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేసిన నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఈ చర్యలు చేపట్టాలని పేర్కొంది.
యేల్ యూనివర్సిటీ, ఇలినాయిస్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, ఐఎస్‌బీ, ఐబీఎం, ఇంటెల్ తదితర సంస్థలు రూపొందించిన 3,800కు పైగా కోర్సులు, 400 స్పెషలైజేషన్‌‌స ఆన్‌లైన్‌లో (www.courrera.org) అందుబాటులో ఉన్నా యంది. ఆన్‌లైన్లో జూలై 31వ తేదీ వరకు ఉచితంగా అందుబాటులో ఉండనున్న ఈ కోర్సులను రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు చదివే విద్యార్థులు సద్వినియోగపరచుకునేలా కాలేజీలు చర్యలు చేపట్టాలని తెలిపింది. జేఎన్‌టీయూ పరిధిలోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆ వెబ్‌సైట్‌లో సైన్-ఆప్ చేసి విద్యార్థులకు యాక్సెస్ ఇవ్వాలని, ఆ కోర్సులను చదువుకునేలా చూడాలని స్పష్టంచేసింది.
Published date : 26 Mar 2020 05:58PM

Photo Stories