Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లో 16 నుంచి ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16 నుంచి ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈనెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఈ మేరకు సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఈసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈసెట్ ప్రాసెసింగ్ ఫీజును ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.450 నుంచి రూ.500కు, మిగిలిన వారికి రూ.900 నుంచి వేయికిపెంచుతూ తీర్మానించారు. ఈసెట్‌కు సంబంధించి 10 శాతం ఫార్మసీ, 10 శాతం యూనివర్సిటీ ఇంజనీరింగ్, 20 శాతం ప్రైవేటు కాలేజీల నుంచి సీట్లు కేటాయించనున్నారు.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో పది లక్షల ఆప్షన్లు:
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సోమవారానికి పది లక్షల ఆప్షన్లు ఆన్‌లైన్లో నమోదయ్యాయి. మొత్తం 61,793 మంది తమ ధ్రువపత్రాలను పరిశీలింపచేసుకున్నారు. 43,154 మంది ఆప్షన్లు నమోదు చేశారు. వీరు 10,41,376 ఆప్షన్లు ఇచ్చారు.
Published date : 14 Jun 2016 01:30PM

Photo Stories