Skip to main content

అందుబాటులోని సీట్లతోనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లకు యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు వచ్చినా, రాకున్నా అందు బాటులో ఉన్న సీట్లతో మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభిం చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.
ఈనెల 12వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యూనివర్సిటీలు అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోని అన్ని సీట్లకు అఫిలియే షన్లు ఇవ్వకపోరుునా ఇప్పటివరకు క్లియరెన్‌‌స వచ్చిన సీట్లతో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి ఈనెల 10వ తేదీలోగా ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ సాంకే తిక విశ్వ విద్యాలయాలు (జేఎన్‌టీయూహెచ్) తమ పరిధిలోని కాలేజీ లకు అనుబంధ గుర్తింపు, సీట్లలో ప్రవేశాలకు అనుమతి ఇస్తామని ఇది వరకే ఉన్నత విద్యా మండలికి తెలియజేశారుు. కానీ ఇంతవరకు జేఎన్‌టీయూహెచ్ నుంచి అనుబంధ గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదు. అరుునా ముందుగా నిర్ణరుుంచిన షెడ్యూలు ప్రకారం కౌన్సిలింగ్‌ను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి, సాంకే తిక విద్యాశాఖ చర్యలు చేపట్టారుు. ఈనెల 12వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారుు. ఇప్పటివరకు జేఎన్‌టీయూహెచ్ తమ పరిధిలోని కాలేజీల్లో 55 వేల సీట్లలో ప్రవేశాలకు అంగీకరించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో మరో 10 వేల సీట్లకు ఈనెల 9,10 తేదీల్లో అనుబంధ గుర్తింపు జాబితా ఇచ్చే అవకా శం ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మరో 3 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నారుు. ఇలా మొత్తంగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో 68 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Published date : 09 Jun 2017 02:03PM

Photo Stories