Skip to main content

ఐఈఎస్‌లో టాపర్‌గా నిట్ వరంగల్ విద్యార్థి

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)-2018లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)-వరంగల్ విద్యార్థులు సత్తా చాటారు.
నేషనల్ టాపర్‌తో పాటు మరో రెండు అత్యుత్తమ ర్యాంకులతో రికార్డు సృష్టించారు. ఐఈఎస్-2018 ఫలితాలు నవంబర్ 10న వెలువడ్డాయి. ఇందులో నిట్-వరంగల్ విద్యార్థి అమన్‌జైన్ నేషనల్ టాపర్‌గా నిలిచాడు. అమన్ నిట్-వరంగల్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇదే కాలేజీ నుంచి అంకిత్ (ఎలక్ట్రికల్) 36వ ర్యాంకు, ప్రభాత్ పాండే (ఎలక్ట్రికల్) 46వ ర్యాంకు సాధించారు. గతేడాది ‘గేట్’లోనూ తమ విద్యార్థి నేషనల్ టాపర్‌గా నిలిచారని నిట్-వరంగల్ డెరైక్టర్ ఎన్‌వీ రమణారావు ‘సాక్షి’తో తెలిపారు. క్యాట్, జీఆర్‌ఈల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. మూడేళ్ల నుంచి వరుసగా రికార్డులు సాధిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని పేర్కొన్నారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 12 Nov 2018 03:48PM

Photo Stories