ఐఈఎస్‌లో నల్లగొండ జిల్లా విద్యార్థికి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్
Sakshi Education
సూర్యాపేట: యూపీఎస్సీ వారు నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షల్లో ఎలక్ట్రికల్ విభాగంలో మొదటి ప్రయత్నంలోనే షేక్ సిద్దీఖ్‌హుస్సేన్ ఆల్ ఇండియాలో ప్రథమర్యాంకు సాధించాడు.
నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన షేక్ హుస్సేన్-కృష్ణవేణి దంపతుల కుమారుడు సిద్దీఖ్‌హుస్సేన్ గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో 2012లో ఐఐటీ పూర్తిచేశాడు. అక్కడే క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ముంబైలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. రెండేళ్లు ఉద్యోగంలో రాణిస్తూ 2015లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లోని మేడ్ ఈజీ లో ఐఈఎస్ శిక్షణ పొందాడు. కాగా 2015 జూన్ 10,11,12 తేదీల్లో యూపీఎస్సీ నిర్వహించిన ఐఈఎస్ పరీక్షకు హాజరయ్యాడు. డిసెంబరు 31న ఫలితాలు వెలువడ్డాయి.
రోజులో 12 గంటలు చదువుకే:
రోజులో 12 గంటలు చదువుకే సమయాన్ని కేటాయించేవాణ్ని. ఎలాగైనా మా తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలనే తపనతో కష్టించి చదివాను. నాన్నస్ఫూర్తి, అమ్మ ధైర్యం నా విజయానికి బాసటగా నిలిచాయి. ఎవరైనా ఏదైనా సాధించాలంటే.. కృష్టి, పట్టుదల ఉంటే చాలు అది సొంతం కాక తప్పదు.

Published date : 07 Jan 2016 12:45PM