ఐఈఎస్‌లో మెరిసిన గ్రామీణ ఆణిముత్యం
Sakshi Education
హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి మహేశ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్(ఐఈఎస్) ఫలితాల్లో 57వ ర్యాంకు సాధించాడు.
గ్రామానికి చెందిన నీరటి మాణిక్యం, సరోజనల మూడో సంతానం మహేశ్. తండ్రి మాణిక్యం హుజూరాబాద్ రెవెన్యూశాఖలో ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నారు. సరోజన గృహిణి. అద్దె ఇంట్లో ఉంటూ తమ నలుగురు పిల్లలను చదివించారు. జనవరిలో ఐఈఎస్ ప్రిలిమినరీ రాసిన మహేశ్.. మేలో మెయిన్ పరీక్ష రాశాడు. ఆగస్టులో ఇంటర్వ్యూ జరగగా, సెప్టెంబర్ 11 రాత్రి విడుదలైన ఈ ఫలితాల్లో ప్రతిభ కనబరిచాడు. హుజూరాబాద్‌లో ప్రాథమిక విద్య, చొప్పదండి నవోదయలో మహేశ్ ఐదో తరగతి చదివాడు. కరీంనగర్‌లోని ఎస్సారార్‌లో ఇంటర్, ఐఐటీ, గౌహతిలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. బీఎస్‌ఎన్‌ఎల్ టెలికం అధికారిగా ఎంపికయ్యాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో దానిని వదులుకొని.. ఐఈఎస్ పరీక్ష రాశాడు.
Published date : 13 Sep 2017 03:52PM