ఐఐటీల్లో ఓబీసీలకు తగ్గిన కటాఫ్ మార్క్
Sakshi Education
హైదరాబాద్: ఐఐటీ టాప్-20 పర్సంటైల్‌కు నిర్ధారించిన కటాఫ్ మార్కుల్లో తలెత్తిన అశాస్త్రీయతను ఐఐటీ ఖరగ్‌పూర్ సరిదిద్దింది. ఐఐటీ కటాఫ్‌పై అయోమయం శీర్షికన ‘సాక్షి’ ఈనెల 2న ప్రచురించిన కథనంపై స్పందించింది. ఓబీసీ కేటగిరీలో టాప్-20 పర్సంటైల్ కటాఫ్‌లో 25 మార్కులను శుక్రవారం తగ్గించింది. ఓబీసీ కటాఫ్ మార్కులను 503 మార్కుల నుంచి 478కి కుదించింది. ఈ మేరకు తమ వెబ్‌ైసైట్‌లో (jeeadv.iitkgp.ac.in) వివరాలను పొందుపరిచింది.
Published date : 05 Jul 2014 12:14PM