Skip to main content

ఐఐటీల్లో 20 శాతం సీట్లు బాలికలకే!

సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో 20 శాతం సీట్లను బాలికలకు కేటాయించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఐఐటీల్లో చేరుతున్న వారిలో ఏటా బాలికల సంఖ్య తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2015తో పోల్చితే 2016లో ఐఐటీల్లో చేరిన విద్యార్థినుల సంఖ్య 2 శాతం తగ్గిన నేపత్యంలో 20 శాతం సీట్లను వారికి కేటాయించాలని జేఏబీ నిర్ణయించింది. బాలికల విషయంలో జేఈఈ అడ్వాన్‌‌సడ్‌లో క్వాలిఫై కావాలన్న అర్హతను కూడా పక్కనపెట్టాలని, టాప్ 20 పర్సంటైల్ ఉంటే చాలని భావించినట్లు తెలిసింది. మరోవైపు ఈ సీట్ల కేటాయింపు విషయంలో సంబంధిత ఐఐటీలే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. అయితే దీన్ని 2017 జేఈఈలో అమలు చేస్తారా.. లేదా 2018లో అమలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Published date : 17 Jan 2017 01:29PM

Photo Stories