Skip to main content

ఐఐటీహెచ్‌లో షార్ట్ టర్మ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

సాక్షి, సంగారెడ్డి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ క్యాంపస్ (ఐఐటీహెచ్)లో మూడు రోజుల పాటు నిర్వహించే షార్ట్ టర్మ్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమృతమ్ రాజగోపాలన్ తెలిపారు.
ఈ మేరకు డిసెంబర్ 9న ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19, 20, 21వ తేదీల్లో ఈ కోర్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘నాన్ లోకల్ మెకానిక్స్ అప్రోచెస్ ఫర్ మోడలింగ్ లోకలైజ్డ్ డిఫర్మేషన్‌‌స’అనే అంశంపై ఈ షార్ట్‌టర్మ్ కోర్సులు ఉంటాయని తెలిపారు. ఈ కోర్సులకు ఎయిర్‌ఫోర్స్, ఆటోమోటివ్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో పని చేసే గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, రీసెర్చిస్కాలర్లు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
Published date : 10 Dec 2019 03:58PM

Photo Stories