ఐఐటీహెచ్‌లో ముగిసిన మొదటి దశ ప్లేస్‌మెంట్స్
Sakshi Education
సాక్షి, సంగారెడ్డి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) క్యాంపస్‌లో మొదటి దశ ప్లేస్‌మెంట్లలో భాగంగా 38 అంతర్జాతీయ ఆఫర్లను దక్కించుకున్నామని ఫ్యాకల్టీ ఇన్‌చార్జి (ప్లేస్‌మెంట్స్) డాక్టర్ ప్రదీప్ తెలిపారు.
ఈ మేరకు డిసెంబర్ 12నఒక ప్రకటన విడుదల చేశారు. 2019-20 సంవత్సరానికి మొదటి దశ ప్లేస్‌మెంట్లలో భాగంగా ఈ ఎంపిక జరిగిందని, డిసెంబర్1వ తేదీన ప్రారంభమైన మొదటి దశ ప్లేస్‌మెంట్ల ప్రక్రియ డిసెంబర్ 12నముగిసినట్లు తెలిపారు. ఇందులో పాల్గొన్న ప్రముఖ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, గోల్డ్మన్ సాచ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఈటన్, బీఎస్‌వై మెల్లన్, బజాజ్ ఆటో, టీఎస్‌ఎంసీ ఉన్నాయని వెల్లడించారు. రెండో దశ ప్లేస్‌మెంట్స్ జనవరి 2020లో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మొత్తం 483 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారని, ఉద్యోగ ఆఫర్లలో ఎక్కువ భాగం ఐటీ, ఐటీఈఎస్ రంగాల నుంచి వచ్చాయని వివరించారు.
Published date : 13 Dec 2019 05:03PM