ఐఐటీహెచ్‌లో ‘ఈ-సమ్మిట్ 2 కే 20’
Sakshi Education
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) క్యాంపస్‌లో జనవరి 18,19 తేదీలలో ‘ఈ-సమ్మిట్ 2 కే 20’సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ఐఐటీహెచ్ జనవరి 10 (శుక్రవారం)న ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులకు ప్రోత్సాహం, అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో 90కి పైగా స్టార్టప్‌లు పాల్గొనే అవకాశం ఉంది. పెట్టుబడిదారుల ధృక్పథం, సెకండరీ సెక్టార్ ఆవశ్యకత, ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం, ఆర్‌అండ్‌డీలో పెట్టుబడులు, భారతదేశం విదేశీ మార్కెట్లోకి ప్రవేశించే ఆవశ్యకత, తదితర అంశాలపై సదస్సులో చర్చ జరుగుతుందని ప్రకటన తెలిపింది.
Published date : 11 Jan 2020 02:50PM