ఐఐటీ విద్యార్థులకు కొలువుల పంట!.. ఖరగ్‌పూర్ ముందంజ
Sakshi Education
కోల్‌కతా: ఐఐటీ విద్యా సంస్థలు మరోసారి తమ విశిష్టతను చాటుకున్నాయి. మొదటి దశ ప్లేస్‌మెంట్ ప్రక్రియ శనివారంతో ముగియగా 1,050 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి.
ఇది గతేడాది కంటే 10 శాతం ఎక్కువ. ఇతర ఐఐటీ విద్యాసంస్థలతో పోలిస్తే అధిక ఉద్యోగావకాశాలు ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థులు దక్కించుకున్నారు. 200 కంపెనీలు ఈ విద్యాసంస్థకు చెందిన 275 మంది విద్యార్థులను నియమించుకున్నాయి. షెల్, ఐటీసీ, గోల్డ్‌మాన్, హిందూస్తాన్ లీవర్, క్రెడిట్ సూసే, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓరాకిల్ తదితర కంపెనీలు ప్లేస్‌మెంట్లలో పాల్గొన్నట్లు ఐఐటీ-ఖరగ్‌ఫూర్ అధికారి తెలిపారు.
Published date : 22 Dec 2014 03:22PM