Skip to main content

ఐఐటీ హైదరాబాద్ ఫెలోషిప్స్‌కు దరఖాస్తులు

సాక్షి, సంగారెడ్డి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్‌హెచ్‌ఈ) 2019 - 20 సంవత్సరానికి ఫెలోషిప్‌ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఐఐటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రేణుజాన్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సీఎఫ్‌హెచ్‌ఈలో ఫెలోషిప్ కోర్సు ప్రారంభమవుతుందని వివరించారు. ఫెలోషిప్‌కు ఎంపికై న వారికి మొదటి సంవత్సరం శిక్షణలో నెలకు రూ.50 వేలు ఇస్తామని తెలిపారు.
Published date : 15 Nov 2019 04:16PM

Photo Stories