అధ్యాపకులులేని ఇంజనీరింగ్ కాలేజీల గుట్టు రట్టు
Sakshi Education
హైదరాబాద్: నిండా లోపాలు, అవకతవకలతో ఇంజనీరింగ్ కాలేజీలను నడిపించిన యాజమాన్యాల అసలు రంగు బయటపడింది.
ఇంతకాలం ఫ్యాకల్టీ లేకుండానే కాలేజీలను నడిపిన వ్యవహారం మొత్తం బట్టబయలయింది. అంతో ఇంతో మంచి పేరున్న కాలేజీలు సైతం సరైన సంఖ్యలో అధ్యాపకులను నియమించుకోలేదన్న సంగతీ వెల్లడైంది.
జేఎన్టీయూహెచ్ క్రిమినల్ కేసులు పెట్టడంతో దెబ్బకి దారికి వచ్చిన యాజమాన్యాలు... భారీ సంఖ్యలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కోసం వేట ప్రారంభించాయి. ప్రిన్సిపాల్‌ల నుంచి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లదాకా ఫ్యాకల్టీ నియామకాల ప్రక్రియను చేపట్టాయి.
లోపాల పుట్టలు..
హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలో 288 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అందులో ఏ లోపాలు లేని కాలేజీలు 20 వరకు ఉంటే, కొద్దిపాటి లోపాలతో ఉన్నవి మరో 25 వరకు ఉం టాయి. ఇక 100 కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు సదుపాయాలు లేకపోవడం వంటి లోపాలున్నాయి. మిగతా 143 కాలేజీల్లో పూర్తిగా లోపాలు ఉన్నట్లు నిపుణుల కమిటీలు తేల్చాయి. దీంతో ఆ 143 ఇంజనీరింగ్ కాలేజీల్లోని 807 బ్రాంచీల్లో ప్రథమ సంవత్సరానికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును రద్దుచేసింది. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుండడంతో.. ఈ కాలేజీలన్నీ ఫ్యాకల్టీ లేకపోయినా ఒక్కో బ్రాంచ్‌లో ఐదారు సెక్షన్లకు అనుమతి తెచ్చుకుని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపేణా భారీ గా దండుకున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనలను ఈ కాలేజీలు పట్టించుకోలేదు. ఒక్కో బ్రాం చ్‌కు ఐదు నుంచి ఆరు సెక్షన్లకు (ఒక్కో సెక్షన్‌కు 60మంది విద్యార్థులు) అనుమతి తెచ్చుకున్నాయి. ఇవేగాక మిగతా 145 కాలేజీల్లోని 100కాలేజీల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండటాన్ని దృష్టి లో ఉంచుకుని జేఎన్టీయూ వీటిని హెచ్చరించి వదిలేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో సదుపాయాలు లేకపోతే అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. అవకతవకలకు పాల్పడిన 16 కాలేజీలపై క్రిమినల్ కేసులను నమోదు చేసింది. దీంతో దారికి వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఫ్యాకల్టీ నియామకాలకు చర్యలు చేపట్టాయి.
పట్టని నిబంధనలు..
నిబంధనల ప్రకారం బీటెక్‌లో ప్రతి 15 మంది విద్యార్థులకు బోధన, బోధనేతర విభాగాల్లో కలిపి నలుగురు సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఎంటెక్‌కు అయితే ప్రతి 12 మంది విద్యార్థులకు ఇద్దరు ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనను పాటించలేదు. జేఎన్టీయూహెచ్ ప్రథమ సంవత్సరం అనుబంధ గుర్తింపును నిరాకరించిన 143 కాలేజీల్లో 50 శాతం ఫ్యాకల్టీ కొరతకు అవకాశమిచ్చినా... 110 కాలేజీలు అనర్హత జాబితాలోనే ఉన్నాయి. 40 శాతం వరకు అధ్యాపకుల కొరతకు మినహాయింపు ఇస్తే 126 కాలేజీలు, 30 శాతం మినహాయింపు ఇస్తే 139 కాలేజీలు అనర్హత జాబితాలో ఉన్నాయి. మిగతా నాలుగు కాలేజీల్లోనూ 25 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉంది.
పక్కా చర్యలతో దారికి..
అనేక తప్పిదాలు, తప్పుడు ధ్రువీకరణలతో ఇన్నాళ్లూ అనుబంధ గుర్తింపు పొంది పబ్బం గడుపుకొన్న అనేక ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు... జేఎన్టీయూ కఠిన చర్యలకు దిగడంతో దారికి వస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీని నియమించుకునే పనిలో పడ్డాయి. వందల కాలేజీలు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర బోధన, బోధనేతర సిబ్బంది వేటలో పడడం గమనార్హం. వివిధ బ్రాంచీల వారీగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలంటూ అన్ని కాలేజీలు వెదుకుతున్నాయి.
ఎంటెక్ ఉండాల్సిందే: ఎంటెక్, పీహెచ్‌డీలు చేసినవారు లేరంటూ బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులతోనే కాలేజీలను నడిపించిన తీరుకు ఇకపై ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. ఎంటెక్ చేసిన అభ్యర్థుల కొరత ఉందంటూ 2014-15లో కాలేజీలు ఏఐసీటీఈ నుం చి ఫ్యాకల్టీ అర్హతల్లో మినహాయింపు తెచ్చుకున్నా ఇక నుంచి కుదరదు. కనీసం ఎంటెక్ పూర్తిచేసిన వారినే ఫ్యాకల్టీగా నియమించాలి. దీనిని 2015-16 నుంచి అమలు చేసేందుకు జేఎన్టీయూహెచ్ కసరత్తు చేస్తోంది.
జేఎన్టీయూ కేసులు పెట్టిన కాలేజీలు..
రంగారెడ్డి జిల్లాలో..

- మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్
- అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్
- బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- కృష్ణమూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్
- విద్యా వికాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- సెయింట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- ప్రిన్స్‌టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్
- సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్
- శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- తూడి నర్సింహారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్
- అశోక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
- కోదాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్
- వరంగల్ జిల్లాలో బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సెన్సైస్
- ఖమ్మం జిల్లాలో ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్
ఫ్యాకల్టీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ‘‘యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది (ఫ్యాకల్టీ) ఇకపై ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఒకరే ఐదారు చోట్ల పని చేయకుండా నియంత్రించేలా ఈ చ ర్యలు చేపట్టాం. ఇందుకు ప్రత్యేకంగా ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను (ఠీఠీఠీ.్జ్టఠజ్చ్చిఛి.జీ) ప్రారంభించాం. ప్రతి కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ.. తమ అర్హతలు, అనుభవం, పనిచేసే కాలేజీ, అందులో చేరిన రోజు తదితర అన్ని వివరాలతో వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్యాకల్టీకి ఒక రిజిస్ట్రేషన్ ఐడీని కేటాయిస్తాం. విద్యాసంస్థలు అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో.. ఈ ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ ఐడీని అందజేయాలి. దీంతో ఒకే ఫ్యాకల్టీ రెండు మూడు కాలేజీల్లో పనిచేయకుండా చర్యలు చేపట్టవచ్చు.’’ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ |
Published date : 04 Apr 2015 11:57AM