Skip to main content

అధోగతిలో భారత ఐఐటీలు!

లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 ఉత్తమ ఐఐటీ(విశ్వవిద్యాలయాల)ల జాబితాలో భారత్‌కు చోటు దక్కలేదు. మంగళవారం విడుదల చేసిన ‘గ్లోబర్ యూనివర్సిటీ ర్యాంకింగ్’లో మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తొలిస్థానంతో రికార్డు సృష్టించింది. ఐఐటీ-ముంబై 222వ స్థానం దక్కించుకోగా, ఐఐటీ-ఢిల్లీ 235, ఐఐటీ-కాన్పూర్ 300 ర్యాంకుల వద్ద కూలబడ్డాయి. ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటీ-మద్రాస్ ఏకంగా 322వ ర్యాంకుకు పరిమితం కాగా, ఐఐటీ-ఖరగ్‌పూర్ 324తో సరిపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 31 దేశాల్లోని వర్సిటీలను పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయించారు.
Published date : 17 Sep 2014 11:50AM

Photo Stories