అభ్యర్థులకు టెట్ శాశ్వత వ్యాలీడిటీ సర్టిఫికెట్లు ఇవ్వండి: ఎన్సీటీఈ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శాశ్వత వ్యాలీడిటీ సర్టిఫికెట్లు అభ్యర్థులకు ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) అన్ని రాష్ట్రాలకు సూచించింది.
2011 ఫిబ్రవరి 11నుంచి నిర్వహించిన టెట్ పరీక్షలో అర్హత సాధించిన, గతంలో పేర్కొన్న ఏడేళ్ల నిబంధన కారణంగా టెట్ సర్టిఫికెట్ వ్యాలీడిటీ కోల్పోయిన అందరికీ ఈ శాశ్వత సర్టిఫికెట్లు జారీ చేయాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు బుధవారం లేఖలు రాసింది.
Published date : 10 Jun 2021 05:33PM