Skip to main content

AP EAPCET: ఇంజనీరింగ్‌లో 80శాతం సీట్లు భరీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ నవంబర్‌ 11తో ముగిసింది.
AP EAPCET
ఇంజనీరింగ్‌లో 80శాతం సీట్లు భరీ

సుమారు 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్‌ కోటాలో 1,13,403 సీట్లు ఉండగా, వీటిలో మూడు విడతల కౌన్సెలింగ్‌లో 90,100 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 23,303 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీల కాలేజీలు 25 ఉండగా, వీటిలోని 6,618 సీట్లలో 5,111 భర్తీ కాగా, 219 ప్రైవేట్‌ కాలేజీల్లోని 1,02,918 సీట్లలో 81,411 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ఆరు ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 3,867 సీట్లు ఉండగా, 3,578 సీట్లు భర్తీ అయ్యాయి.

చదవండి: Success Story: పెట్రోల్ బంక్ వ‌ర్క‌ర్ కుమార్తెను..అభినందించిన ఐఓసీఎల్‌ చైర్మ‌న్

ఈఏపీసెట్‌ అడ్మిషన్లను రెండు విడతల్లోనే ముగించాలని తొలుత భావించారు. అయితే ఐఐటీలు, ఎన్‌ఐటీలలో సీట్లు పొందిన విద్యార్థులు వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేసేందుకు నవంబర్‌ 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈ కౌన్సెలింగ్‌కు 331 మంది కొత్త విద్యార్థులతోపాటు ఇంతకుముందే సీట్లు పొందిన 9,958 మంది (సై్లడింగ్‌) హాజరయ్యారు. వారిలో 3,458 మందికి కొత్తగా సీట్లు కేటాయించారు. మిగిలి ఉన్న 23,303 సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో ఆయా కాలేజీలు భర్తీ చేయనున్నాయి. 

చదవండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్‌ షైన్‌!

Published date : 12 Nov 2022 03:34PM

Photo Stories