8 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ ఈనెల 1న నోటిఫికేషన్ జారీ చేసింది.
కాలేజీలు, కోర్సులు, సీట్లవారీగా ప్రభుత్వం నుంచి ఆమోదం రానుండడంతో అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ పండాదాస్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు పూర్తిచేశారు. 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని కాలేజీలకు అనుమతులు జారీచేసింది. వీటికి యూనివర్సిటీల నుంచి ఆమోదం అనంతరం ప్రభుత్వం నుంచి జీఓ విడుదల కావలసి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కౌన్సెలింగ్ ప్రారంభ సమయానికల్లా కాలేజీల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ఏఐసీటీఈ అనుమతుల ప్రకారం రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు యూనివర్సిటీల పరిధిలో 19 ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 430 ఉన్నాయి. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు మొత్తం 1,80,013 ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో అత్యధికంగా 42,165 సీట్లు, కంప్యూటర్ సైన్‌స ఇంజనీరింగ్‌లో 34,557 సీట్లు, మెకానికల్‌లో 30,335, ఈఈఈలో 24,944, సివిల్ ఇంజనీరింగ్‌లో 23,007 సీట్లు ఉన్నాయి. గత ఏడాది కొన్ని కాలేజీల్లో అసలు విద్యార్థులే చేరకపోగా మరికొన్ని కాలేజీల్లో అరకొరగా మాత్రమే ప్రవేశించారు. అలాంటి కాలేజీల్లో కొన్ని మూసివేతకు దరఖాస్తు చేసుకోగా మరికొన్ని కోర్సులను తగ్గించుకున్నాయి. కొన్ని కొత్త కాలేజీలకు ఈసారి అనుమతులు రావడంతో పాటు మరికొన్ని అదనంగా సీట్లు పెంచుకున్నాయి. ఫలితంగా గత ఏడాదికన్నా ఈసారి సీట్ల సంఖ్య పెరుగుతోంది.
పరిశీలనకు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు ఇవీ....
ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్‌టికెట్, ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సీ, లేదా తత్సమాన మార్కుల మెమో, ఇంటర్మీడియెట్ మెమో, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్యూషన్ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెలుపు రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగ, ఎన్‌సీసీ, క్రీడలు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు తమ ధ్రువపత్రాలు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు...
ధ్రువపత్రాల పరిశీలన: జూన్ 8 - 17
వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 11 - 20
ఆప్షన్లలో మార్పులు: జూన్ 21 - 22
సీట్ల అలాట్‌మెంటు: జూన్ 25
తరగతుల ప్రారంభం: జూన్ 29
https://apeamcet.nic.in వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ వివరాలను పొందుపర్చారు.

Published date : 02 Jun 2017 02:36PM