68,747కు చేరిన కన్వీనర్ కోటా సీట్లు
13 కాలేజీల్లో ఫీజులు ఖరారు:
అనుబంధ గుర్తింపు లభించిన మిగతా కాలేజీలు మైనారిటీ కేటగిరీలో సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆయా కాలేజీల్లో లోపాలు ఉండటంతో జేఎన్‌టీయూహెచ్ మొదట వాటికి అనుబంధ గుర్తింపు నిరాకరించింది. దీంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. అనుబంధ గుర్తింపును మంజూరు చేసింది. మరోవైపు గురువారం 5 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం.. శుక్రవారం మరో 13 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన కాలేజీల్లో షాదాన్‌కు రూ.38 వేలు, సయ్యద్ హస్మిమ్‌కు రూ.35 వేలు, ఖదీర్ మెమోరియల్ కాలేజీకి రూ.50 వేలు, మెదక్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు రూ.45 వేలు, రాయల్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.35 వేలు, షాదాన్ ఉమెన్స్ కాలేజీకి రూ.35 వేలు, నవాబ్ షా ఆలామ్‌ఖాన్ కాలేజీకి రూ.68 వేలు, శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీకి రూ.45 వేలు, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి రూ.35 వేలుగా నిర్ణయించింది. అలాగే షాదాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రూ. 35 వేలు, షాదాన్ ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీకి రూ.35 వేలు, అన్వరుల్ ఉలుమ్ కాలేజీకి రూ.42 వేలు, అదే యాజమాన్యానికి చెందిన మరో కాలేజీకి రూ.70 వేలుగా ఫీజును నిర్ణయించింది.
ఆప్షన్లు ఇచ్చుకున్నది 55,019 మంది:
ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 1 నుంచి 90 వేల ర్యాంకు వరకు విద్యార్థుల్లో 57,122 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, శుక్రవారం రాత్రి వరకు అందులో 55,019 మంది విద్యార్థులు 27,26,753 ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక 45,001 నుంచి 90 వేల ర్యాంకు లోపు విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. 90,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులకు శుక్రవారం లాగిన్ ఐడీలను పంపించామని, వారు కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. ఇప్పటివరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు.. 9, 10 తేదీల్లో ఇచ్చే వారు మొత్తంగా 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు.
అదనంగా వచ్చిన కాలేజీలు కలుపుకుని ప్రస్తుతం కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు :
కోర్సు | సీట్లు | ||
ఇంజనీరింగ్ | వర్సిటీ కాలేజీల్లో | ప్రైవేటు కాలేజీల్లో | మొత్తం |
అగ్రికల్చర్ | 32 | - | 32 |
ఏరోనాటికల్ | - | 168 | 168 |
ఆటోమొబైల్ | - | 84 | 84 |
బయోటెక్నాలజీ | - | 42 | 42 |
బయోమెడికల్ | 30 | 21 | 51 |
సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ | 60 | - | 60 |
కెమికల్ | 120 | 126 | 246 |
సివిల్ | 270 | 8,149 | 7,879 |
సీఎస్‌ఈ | 17,665 | 550 | 17,115 |
డైరీ టెక్నాలజీ | 21 | - | 21 |
డిజిటల్ టెక్నిక్స్ ఫర్ | 630 | - | 60 |
ఈసీఈ | 500 | 16,833 | 17,333 |
ఈఈఈ | 490 | 8,916 | 8,426 |
ఈఐఈ | - | 280 | 280 |
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ | 22 | - | 22 |
ఫుడ్ టెక్నాలజీ | 20 | - | 20 |
ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ | 60 | - | 60 |
ఐటీ | 240 | 2,331 | 2,571 |
ప్రొడక్షన్ ఇంజనీరింగ్ | - | 112 | 112 |
మెకట్రానిక్స్ | - | 42 | 42 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 330 | 9,678 | 10,008 |
మెటలర్జికల్ ఇంజనీరింగ్ | 60 | - | 60 |
మైనింగ్ ఇంజనీరింగ్ | 55 | - | 55 |
మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ | - | 42 | 42 |
మెటీరియల్ సైన్స్ | 60 | - | 60 |
ఫార్మ్-డి | - | 290 | 290 |
ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ | - | 42 | 42 |
ఫార్మాస్యూటికల్ సైన్స్ | 80 | 2,060 | 2,140 |
ప్లానింగ్ | 40 | 56 | 96 |
టెక్స్‌టైల్ టెక్నాలజీ | 20 | - | 20 |
మొత్తం | 3,120 | 65,627 | 68,747 |