6 నుంచి పాలిసెట్ దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్-2014ను మే 21న నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తెలిపింది. అభ్యర్థులు ఈనెల 6 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. హెల్ప్‌లైన్ కేంద్రాలు/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. పరీక్షను మే 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇతర వివరాలకు sbtetap.gov.in చూడొచ్చు.
Published date : 03 Apr 2014 12:25PM