44 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపుపై సందిగ్ధత!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 44 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులపై సందిగ్ధత నెలకొంది.
ఆయా కాలేజీలు 111 జీవో పరిధిలోని ప్రదేశాలు, భూదాన్ భూముల్లో ఉండటంతో వాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీలకు అనుమతులపై కొంత గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 212 ఇంజనీరింగ్ కాలేజీలుండగా 168 కాలేజీల్లో ప్రవేశాలకే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. ఇక జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు జాబితాను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. జూన్ 7 లోగా అనుబంధ గుర్తింపు జాబితాను ఇస్తామని జేఎన్‌టీయూహెచ్ పేర్కొనగా, జూన్ 15 లోగా ఎట్టి పరిస్థితుల్లో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఏఐసీటీఈ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రముఖుల కాలేజీలు ఉండటంతో ఈలోగా వాటికి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Published date : 01 May 2018 03:44PM