Skip to main content

42 వేల ఇంజనీరింగ్ సీట్లు రద్దు!

స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్న యాజమాన్యాలు ఆమోదించిన జేఎన్‌టీయూహెచ్ నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కాలేజీలే ముందుకు వచ్చి సీట్ల రద్దుకు దరఖాస్తు చేస్తున్నాయి.
  13వ తేదీ నాటికి 213 ఇంజనీరింగ్ కాలేజీలు 42 వేల సీట్ల రద్దుకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 13 కాలేజీలు పూర్తిగా మూసివేసేందుకు అర్జీ పెట్టుకున్నాయి. ఈ దరఖాస్తులకు వెంటనే జేఎన్‌టీయూహెచ్ ఆమోదం తెలిపింది. సీట్ల రద్దుకు అవసరమైన నిరభ్యంతర పత్రాల జారీని మంగళవారం ప్రారంభించింది.

వరుస చర్యలతో కొరడా..
నిర్ణీత నిబంధనలు అమలు చేయని, నాణ్యత ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై ఇటీవల జేఎన్‌టీయూహెచ్ కొరడా ఝుళిపించింది. దీంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గత విద్యా సంవత్సరం (2014-15) ప్రవేశాల సందర్భంగా నిబంధనలు పాటించని, లోపాలున్న 163 కాలేజీలకు అఫిలియేషన్ జేఎన్‌టీయూహెచ్ నిరాకరించింది. దీనిపై యాజమాన్యాలు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. షరతులతో అఫిలియేషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే ప్రవేశాలు పూర్తి కావడంతో వాటిలో పెద్దగా విద్యార్థులు చేరలేదు. పైగా సుప్రీం ఆదేశాల మేరకు ఆయా కాలేజీల్లో జాతీయ విద్యా సంస్థలకు చెందిన నిఫుణులతో జేఎన్‌టీయూహెచ్ తనిఖీ లు చేపట్టి, మళ్లీ లోపాలున్నట్లు తేల్చింది. దీంతో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 143 కాలేజీల్లో 807 బ్రాంచీలకు అనుబంధ గుర్తింపును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది. 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీలు మళ్లీ తమ అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూహెచ్‌లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే గతానుభవాల దృష్ట్యా గతంలో అనుమతులు పొందిన అన్ని సీట్లలో అడ్మిషన్లకు ఈసారి ప్రవేశాలు చేపట్టట్లేదు. 213 కాలేజీల్లోని 42 వేల సీట్ల రద్దుకు దరఖాస్తు చేశాయి. అసలు ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఉన్న అన్ని సీట్లకు అవసరమైన ఫ్యాకల్టీని, వసతులను యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఎక్కువ కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు కానీ మొత్తం సీట్లకు ఫ్యాకల్టీని, వసతులను కల్పించాల్సి ఉండటంతో కాలేజీలు సీట్ల రద్దు కోసం దరఖాస్తు చేశాయి. వాటి రద్దుకు ఆమోదం తెలుపుతూ జేఎన్‌టీయూహెచ్ ఎన్‌వోసీలను ఇస్తోంది.

ఇదీ జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్ల పరిస్థితి..

సంవత్సరం

కాలేజీలు

సీట్లు

2014-15లో

288

1,80,425

2015-16లో

278

1,38,425



మళ్లీ తనిఖీలు!
నిబంధనల ప్రకారం 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో జేఎన్‌టీయూహెచ్ మళ్లీ తనిఖీలు చేయనుంది. ఈ సందర్భంగా లోపాలు, నిర్ణీత నిబంధనలు పాటించని కాలేజీల్లో బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. దీంతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు తేలిన లోపాలను బట్టి చూస్తే గత ఏడాది గుర్తింపును నిరాకరించిన 143 కాలేజీల్లో సగం కాలేజీలకు 2015-16 ప్రవేశాల కోసం గుర్తింపు లభించే పరిస్థితి కనిపించట్లేదని చెబుతున్నారు. ఆయా కాలేజీలన్నీ ఫ్యాకల్టీని పక్కాగా నియమించి, సదుపాయాలు కల్పిస్తేనే గుర్తింపు వస్తుందంటున్నారు.

సీట్లు తగ్గే మొత్తం కాలేజీలు

213

కాలేజీలే రద్దయ్యేవి

10

బ్రాంచీలు రద్దయ్యేవి

90

సీట్లు రద్దయ్యేవి

110

రద్దు అయ్యే మొత్తం సీట్లు

42,000

అందులో కన్వీనర్ కోటా

29,400

మేనేజ్‌మెంట్ కోటా

12,600

Published date : 15 Apr 2015 12:27PM

Photo Stories