26వ తేదీలోగా పీజీఈసెట్ సీట్ల కేటాయింపు
Sakshi Education
హైదరాబాద్: పీజీఈసెట్ అభ్యర్థులకు ఈనెల 26లోగా సీట్ల కేటాయింపున కు ఏర్పాట్లు చేస్తున్నామని కన్వీనర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం తెలి పారు. ఈనెల 12నుంచి ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటి దాకా 37,300 మంది అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 58,838 ఎంటెక్/ఎంఫార్మసీ సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయని, వీటిలో తెలంగాణ ప్రాంతంలో మొత్తం 34,410 సీట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 24,428 సీట్లు ఉన్నట్లు చెప్పారు. హైకోర్టులో కొనసాగుతున్న జేఎన్టీయూహెచ్ కళాశాలల అఫిలియేషన్ కేసు కొలిక్కిరాని పక్షంలో.. ఆయా కళాశాలల్లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల సీట్ అలాట్‌మెంట్లను విత్‌హెల్డ్‌లో పెడతామని కన్వీనర్ పేర్కొన్నారు.
Published date : 17 Sep 2014 11:48AM