Skip to main content

25న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈనెల 25న నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థలు ప్రకటించాయి. ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) అవకాశం కల్పించాయి. ఈసారి పరీక్షను ముంబై, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈనెల 25న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. ఐఐటీలో చేరాలంటే జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. జేఈఈ-మెయిన్ పరీక్షలో తొలి 1,50,000లోపు ర్యాంకు వారే జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కేటగిరీ వారీగా అభ్యర్థులు సాధించిన జాతీయస్థాయి ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. అయితే వీరంతా ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన 12వ తరగతిలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి.

జేఈఈ-అడ్వాన్స్‌డ్- 2014 ముఖ్య తేదీలు

ఫీజు చెల్లింపు చివరి తేదీ మే 12 వరకు
అడ్మిట్‌కార్డులు మే 10 నుంచి మే 24 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ప్రవేశపరీక్ష తేదీ మే 25
పేపరు-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపరు-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు
‘కీ’ విడుదల జూన్ 1న వెబ్‌సైట్‌లో చూడొచ్చు
ఓఆర్‌ఎస్ షీట్లు జూన్ 8 నుంచి 11 వరకు వెబ్‌సైట్‌లో ఉంచుతారు
ఫలితాలు జూన్ 19
ఆర్కిటెక్చర్‌ఆప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 26
ఆర్కిటెక్చర్ ఫలితాలు జూన్ 29
మొదటి దశ సీట్లు కేటాయింపు ప్రకటన జూలై1, 4వ తేదీ లోగా ప్రవేశ ఫీజు చెల్లింపునకు అవకాశం.
రెండో దశ సీట్లు కేటాయింపు జులై 7
రెండో దశలో సీట్లు పొందినవారు కళాశాలల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూలై 10.
సీట్లు ఉపసంహరణ, ఫీజు రీఫండ్ జూలై 9 నుంచి 11 వరకు.
మూడో దశ సీట్లు కేటాయింపు జూలై12.
ప్రవేశ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూలై14
Published date : 06 May 2014 12:56PM

Photo Stories