23 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కళాశాలల వర్క్‌షాప్
Sakshi Education
కురబలకోట: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులకు ఈ నెల 23 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సాంకేతిక భవన్‌లో వర్క్‌షాప్ జరగనుంది.
ఈ మేరకు ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపెస్మా) రాష్ట్ర అధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎం. శాంతి రాముడు, మిట్స్ ఎన్. విజయభాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ ఆధారంగా ఫీజుల పెంపునకు ఇంజనీరింగ్ కళాశాలలు తగిన సమాచారం పంపాల్సి ఉందన్నారు. ఈ సమాచారాన్ని ఏవిధంగా ఏఎఫ్‌ఆర్‌సీకి పంపాలన్న దానిపై అవగాహన కోసం హైదరాబాదులో ఈ వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. 23న శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి జిల్లాల ఇంజనీరింగ్ కళాశాలల వారు పాల్గొనాలని తెలిపారు. 24న పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, 25న నెల్లూరు, చిత్తూరు, ఆనంతపురం, కడప, కర్నూరు జిల్లాల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు హాజరుకావాలని తెలిపారు.వర్క్‌షాపులో పాల్గొంటే ఏఎఫ్‌ఆర్‌సీకి సరైన క్రమంలో సమాచారాన్ని పంపడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు.
Published date : 16 Nov 2015 03:13PM