23 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి తుదివిడత కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లతో పాటు ఫార్మా-డి కోర్సులకూ ఈ విడతలో కేటాయింపు జరగనుంది. మొదటివిడత కౌన్సెలింగ్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోని వారు శనివారం ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. వెబ్ ఆప్షన ్ల నమోదు శనివారం నుంచే ప్రారంభమవుతుందని అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రఘనాథ్ పేర్కొన్నారు. వెబ్‌ఆప్షన్లకు ఈనెల 24 సాయంత్రం 6గంటల వరకు గడువు ఉంది. సీట్ల కేటాయింపు ఈనెల 26న ఆన్‌లైన్లో జరుగుతుంది. తుదివిడత కౌన్సెలింగ్‌కు కళాశాలల వారీ కోర్సులు, సీట్ల ఖాళీలు, ఇతర వివరాలకు apeamcet.nic.in ’ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Published date : 23 Jul 2016 03:18PM