2021–22 అకడమిక్ కేలండర్ విడుదల చేసిన ఏఐసీటీఈ: ఇంజనీరింగ్ క్లాసులు ఎప్పటినుంచంటే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల అకడమిక్ కేలండర్‌ను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) బుధవారం విడుదల చేసింది. జూలై 30కల్లా తాము కాలేజీలకు అనుమతులు ఇస్తామని పేర్కొంది.
యూనివర్సిటీలు వచ్చే నెల 15లోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసింది. కాలేజీల్లో మొదటి దశ ప్రవేశాలను ఆగస్టు 30 వరకు పూర్తి చేయాలని సూచించింది. ఆ విద్యా ర్థులకు సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారం భించాలని వివరించింది. మొదటి సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి సెప్టెంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని తెలిపింది. రెండో దశ కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని, మిగిలిన సీట్లలోనూ ప్రవేశాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 20 నాటికి లాటరల్ ఎంట్రీ (డిప్లొమా విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో) ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది.
Published date : 24 Jun 2021 04:56PM