20 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ ఈనెల 10న జారీ కానుంది. విద్యార్థుల నుంచి 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేదుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తు విధానానికి సంబంధించిన అంశాలపై మండలి అధికారులు శుక్రవారం చర్చించారు.
గత ఏడాది దరఖాస్తు ఫీజు చెల్లించిన బ్యాంకులతోపాటు మరిన్ని బ్యాంకుల్లో ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకు అధికారులతోనూ సమావేశం అయ్యారు. ఈనెల 10లోగా ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఏపీ ఆన్‌లైన్, మీసేవా, ఈసేవా కేంద్రాలు, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటాక్ మహీంద్ర బ్యాంకులతోపాటు జాతీయ బ్యాంకులైన ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల్లోనూ ఎంసెట్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజులను పెంచాలని ప్రతిపాదనలు అందినా, రానున్న ఎన్నికల కారణంగా ఫీజులు పెంచరాదని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

Published date : 08 Feb 2014 01:07PM