2 లక్షలకు చేరిన ఎంసెట్ దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తులు ఆదివారం రాత్రి వరకు 2 లక్షలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 20న దరఖాస్తుల జారీ ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వాటిని స్వీకరిస్తారు. గడువులోగా మరో 2 లక్షలకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎంసెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 59,500 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంజనీరింగ్ కోసం 1,39,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 900 మంది రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 26తో ముగుస్తుండటంతో ఆ తర్వాతే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Published date : 24 Mar 2014 10:30AM