Skip to main content

167 పరీక్షా కేంద్రాల్లో ప్రారంభమైన విఐటి - 2019 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష

విజయవాడ: ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం వెల్లూరు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (విఐటి)లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే విట్ - 2019 ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష బుధవారం అమరావతిలో ప్రారంభమైంది
. పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో జరిగే ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 29 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 167 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 21 వరకు ఈ పరీక్ష జరగనుంది. విఐటీలో జరుగుతున్న రికార్డు స్థాయి నియామకాలు, వినూత్నమైన కోర్సులు, ఆవిష్కరణలు దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని విట్ ఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి శుభాకర్ అన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను www.vit.ac.in లో ప్రకటించనున్నట్లు విట్ ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్ చెప్పారు.
Published date : 12 Apr 2019 02:25PM

Photo Stories