10న ఎంసెట్ నోటిఫికేషన్.. 20 నుంచి దరఖాస్తులు.. మే 17న ఎగ్జామ్.. జూన్ 2న ర్యాంకులు
Sakshi Education
హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) నోటిఫికేషన్‌ను ఈనెల 10న జారీ చేస్తామని, 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్‌వీ రమణారావు వెల్లడించారు.
ఇవీ నిర్ణయాలు..
ఫిబ్రవరి 10: నోటిఫికేషన్
ఫిబ్రవరి 20: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఏప్రిల్ 4: దరఖాస్తుకు చివరి తేదీ
ఏప్రిల్ 6 నుంచి 13 వరకు: దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం
ఏప్రిల్ 18: రూ. 500 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
ఏప్రిల్ 25: రూ. 1,000 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునే అవకాశం
మే 2 నుంచి 15 వరకు: వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
మే 5: రూ. 5,000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
మే 14: రూ. 10,000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
మే 17: ఎంసెట్ రాత పరీక్ష
మే 26: కీ పై అభ్యంతరాల స్వీకరణ
జూన్ 2: ర్యాంకుల వెల్లడి
సిలబస్ మారింది
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2012-13), ద్వితీయ సంవత్సరాల (2013-14) సిలబస్‌ను ఇంటర్ విద్యాశాఖ మార్పు చేసినందువల్ల.. మారిన సిలబస్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంసెట్ సిలబస్‌ను తాజాగా రూపొందించారు. పూర్తిగా వాటినుంచే ప్రశ్నలు ఇవ్వడం కాకుండా విద్యార్థుల విషయ పరిజ్ఞానం, అవగాహన సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఎంసెట్ సిలబస్‌ను రూపొందించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు, ఇంజనీరింగ్‌కు వేర్వేరుగా రూపొందించిన సిలబస్‌కు మంగళవారం ఎంసెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈసారి ఎంసెట్ రాసే వారిలో తాజాగా ఇంటర్ పాసయ్యే వారితోపాటు అంతకుముందు ఉత్తీర్ణులైన వారికి ఇదే సిలబస్ ఉంటుందని స్పష్టం చేసింది. ఎంసెట్ తాజా సిలబస్ సాక్షి వెబ్‌సైట్‌లో (www.sakshieducation.com) లభిస్తుంది.
ఇవీ నిర్ణయాలు..
- ఈసారి వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ జవాబుపత్రాలను అందుబాటులో ఉంచుతారు.
- బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్‌పాయింట్ పెన్‌తోనే పరీక్ష రాయాలి.
- ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలను పరిగణనలోకి తీసుకొని 25 శాతం వెయిటేజీ కలిపి ర్యాంకులు.
- తరువాత సప్లిమెంటరీ వారికి ర్యాంకులను ఇస్తారు. వారికి వేరుగా కౌన్సెలింగ్ ఉంటుంది.
- దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే ఈసారి ఆన్‌లైన్‌లోనే మార్పులు చేసుకోవచ్చు.
- వాటర్ మార్కు, యూనిక్ బార్‌కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.
- ఆధార్ నంబరు (ఆప్షనల్) ఇవ్వాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్లు, పుట్టిన జిల్లా, రాష్ట్రం తప్పనిసరిగా వేయాలి.
- ఎంసెట్ రాసేందుకు గరిష్ట వయోపరిమితి లేదు. పరీక్ష ఫీజు పెంపు లేదు.
- పరీక్ష హాల్లోకి రావడం నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
- నాలుగు జోన్లు ఉన్న హైదరాబాద్‌ను విద్యార్థుల సౌలభ్యం కోసం 8 జోన్లుగా విభజిస్తారు.
- హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఇంటి నుంచి, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి ఈసారి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీల్లేదు.
- ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు, గార్డియన్ ఫొటోలను అప్‌లోడ్ చేయాలి.
- అలా అప్‌లోడ్ చేసిన వారినే హెల్ప్‌లైన్ కేంద్రాల్లోకి విద్యార్థికి సహాయకులుగా అనుమతిస్తారు.
- ఆప్షన్లు ఇచ్చేందుకు ఒక్కో విద్యార్థికి గంటన్నర సమయం ఇస్తారు.
- ఆప్షన్లు మార్చుకోవాలన్నా హెల్ప్‌లైన్ కేంద్రానికి రావాల్సిందే.
ఫిబ్రవరి 10: నోటిఫికేషన్
ఫిబ్రవరి 20: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఏప్రిల్ 4: దరఖాస్తుకు చివరి తేదీ
ఏప్రిల్ 6 నుంచి 13 వరకు: దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం
ఏప్రిల్ 18: రూ. 500 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
ఏప్రిల్ 25: రూ. 1,000 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునే అవకాశం
మే 2 నుంచి 15 వరకు: వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
మే 5: రూ. 5,000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
మే 14: రూ. 10,000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
మే 17: ఎంసెట్ రాత పరీక్ష
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్
- మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్
మే 26: కీ పై అభ్యంతరాల స్వీకరణ
జూన్ 2: ర్యాంకుల వెల్లడి
సిలబస్ మారింది
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2012-13), ద్వితీయ సంవత్సరాల (2013-14) సిలబస్‌ను ఇంటర్ విద్యాశాఖ మార్పు చేసినందువల్ల.. మారిన సిలబస్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంసెట్ సిలబస్‌ను తాజాగా రూపొందించారు. పూర్తిగా వాటినుంచే ప్రశ్నలు ఇవ్వడం కాకుండా విద్యార్థుల విషయ పరిజ్ఞానం, అవగాహన సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఎంసెట్ సిలబస్‌ను రూపొందించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు, ఇంజనీరింగ్‌కు వేర్వేరుగా రూపొందించిన సిలబస్‌కు మంగళవారం ఎంసెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈసారి ఎంసెట్ రాసే వారిలో తాజాగా ఇంటర్ పాసయ్యే వారితోపాటు అంతకుముందు ఉత్తీర్ణులైన వారికి ఇదే సిలబస్ ఉంటుందని స్పష్టం చేసింది. ఎంసెట్ తాజా సిలబస్ సాక్షి వెబ్‌సైట్‌లో (www.sakshieducation.com) లభిస్తుంది.
Published date : 05 Feb 2014 12:19PM