Skip to main content

Andhra Pradesh: రిక్రూట్‌మెంట్‌ అధికారి గురుప్రీత్‌ అత్వాల్ ప్ర‌క‌ట‌న‌

వ‌చ్చే నెల‌లో జ‌రిగే అగ్నిప‌థ్ వాయు-వాద్య‌కారుల ఎంపిక గురించి వివ‌ర‌ణ ఇచ్చిన అత్వాల్. అభ్య‌ర్థుల‌కు కావ‌ల్సిన ల‌క్ష‌ణాలు ఇవే...
registrations for agnipath vayu officers
registrations for agnipath vayu officers

సాక్షి ఎడ్యుకేష‌న్ : వాయుసేనలో వాద్యకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు రిక్రూట్‌మెంట్‌ అధికారి గురుప్రీత్‌ అత్వాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌ బేగంపేట భారత యువసేనలో వచ్చే నెల 15, 16 తేదీల్లో అగ్నిపథ్‌ వాయు– వాద్యకారుల ఎంపికకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లక్షద్వీప్‌, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు.

తగ్గిన పోస్టులు..పెరిగిన ఆందోళన

    శరీర దారుఢ్యం కలిగి, ఫ్లూట్‌, క్లారినెట్‌, శాక్సాఫోన్‌, కీబోర్డు, ఆర్గాన్‌, పియానో, గిటార్‌, వయోలిన్‌, క్లాసికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో డిప్లమో లేదా డిగ్రీ కలిగి ఉండాలన్నారు. 162 సెంట్రీమీటర్ల ఎత్తు, తగిన బరువు ఉండాలన్నారు. ఛాతీ 5 సెంటీమీటర్ల వరకు విస్తరించగలగాలని, స్పష్టమైన కనుచూపు ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు agnipathvayu.cdac.in./AV వైబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.


 

Published date : 26 Aug 2023 01:49PM

Photo Stories