TS EdCET 2022: ఫలితాలు విడుదల.. టాపర్స్ వీరే..
ఈ పరీక్షలో బాలుర కంటే బాలికలు దాదాపు ఐదురెట్లు అధికంగా అర్హత సాధించడం గమనార్హం. బాలికలు 25,246 మంది, బాలురు కేవలం 5,334 మంది మాత్రమే అర్హత సాధించారు. జూలై 26న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఆగస్టు 26న హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 213 బీఈడీ కాలేజీల్లో 19,100 సీట్లున్నాయని, ఇందులో కన్వీనర్ కోటా కింద 13,500 సీట్లు ఉన్నాయని ఎడ్‌సెట్ కన్వీనర్ తెలిపారు. ఈ సంవత్సరం కాలేజీల తనిఖీ, గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు.
చదవండి: ఉపాధ్యాయ వృత్తికి మార్గం.. ఎడ్‌సెట్
అర్హత వివరాలు ఇలా...
ఎడ్‌సెట్‌కు వచ్చిన దరఖాస్తులు: 38,091
పరీక్షకు హాజరైన అభ్యర్థులు: 31,578
మొత్తం అర్హత సాధించినవారు: 30,580 (96.84)
అర్హత పొందిన విద్యార్థినులు: 25,246
అర్హత పొందిన బాలురు: 5,334
చదవండి: AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)
టాపర్స్ వీరే..
- అభిషేక్ మహంతి, మేడ్చల్
- ఎం.ఆంజనేయులు, రంగారెడ్డి
- ముఖేశ్, మేడ్చల్
- బల్లం మహేశ్ కుమార్, జనగాం
- అర్హద్ అహ్మద్, మేడ్చల్
- పావని విశ్వాక్, సంగారెడ్డి
- జెడ్ సుమతి, నిర్మల్
- బి రవితేజ యాదవ్, మహబూబ్‌నగర్
- నెర్లకంటి వెంకటేశ్ సాగర్, రంగారెడ్డి
- వడ్డేపల్లి చంద్రమౌళి, సిద్దిపేట