AP ECET 2022: సబ్జెక్టుల వారీగా ఫస్ట్ ర్యాంకర్లు
ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెట్ ఫలితాలను హేమచంద్రారెడ్డి, JNTU (కాకినాడ) వైస్ చాన్సలర్ ప్రసాదరాజు మీడియాకు వెల్లడించారు. ఈసెట్‌కు 38,801 మంది దరఖాస్తు చేయగా 36,440 మంది పరీక్ష రాశారు. వీరిలో 33,657 మంది అర్హత మార్కులు సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 26,062 మంది మిగతా 9వ బాలురు కాగా 7,595 మంది బాలికలున్నారు. 14 విభాగాలకు గాను 11 విభాగాల అభ్యర్థులకే పరీక్షలు నిర్వహించారు. సిరామిక్ టెక్నాలజీలో 22 మంది, బీఎస్సీ మ్యాథ్స్‌లో 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా బయోటెక్నాలజీలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ మూడు విభాగాల వారికి పరీక్ష నిర్వహించలేదు. బీఎస్సీ మ్యాథ్స్, సిరామిక్ టెక్నాలజీ అభ్యర్థులకు వారి అర్హత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ప్రాథమిక ‘కీ’పై 1,100 అభ్యంతరాలు రాగా వాటిలో ఏడు ప్రశ్నలకు సంబంధించి వచ్చినవి మాత్రమే సరైన అభ్యంతరాలుగా పరిగణించారు. వీటిలోనూ 4 ప్రశ్నల్లో 2 జవాబులు సరైనవిగా నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రశ్నలకు ఆ రెండు సమాధానాలు గుర్తించిన వారికి మార్కులు కలిపారు. మరో 3 ప్రశ్నలకు సంబంధించి తప్పిదం దొర్లడంతో.. సమాధానమిచ్చిన వారికి పూర్తి మార్కులు జత చేశారు. ఈసెట్‌లో 14 వేల వరకు సీట్లు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వివరించారు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థుల ర్యాంకులను వారి డిగ్రీ ఫలితాల అనంతరం ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, ప్రొఫెసర్ లక్ష్మమ్మ, కన్వీనర్ ప్రొఫెసర్ కష్ణమోహన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
AP ECET 2022 Results - Click Here
సబ్జెక్టుల వారీగా ఫస్ట్ ర్యాంకర్లు
కంప్యూటర్ సైన్స్ |
తుంపూడి బీవీఎన్‌ఎస్ కార్తికేయ (ఏలూరు జిల్లా) |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ |
సుంకేశుల సాయి మానస (అన్నమయ్య జిల్లా) |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ |
రుద్రారం సాయికుమార్ (నల్లగొండ, తెలంగాణ) |
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ |
కుదక సాయి సుధీర్ (తణుకు, పశ్చిమగోదావరి) |
మెకానికల్ |
వడిసెల వరుణ్ (విశాఖపట్నం) |
మెటలార్జికల్ |
నక్కా సోమేశ్వరరావు (రావికమతం, అనకాపల్లి జిల్లా) |
మైనింగ్ |
నాయకుల ఉపేందర్ (తొర్రూరు, తెలంగాణ) |
ఫార్మసీ |
మహ్మద్ ముస్కాన్ బాను (హిందూపురం, సత్యసాయి జిల్లా) |
అగ్రికల్చరల్ |
రమావత్ గోపీనాయక్ (మాచర్ల, పల్నాడు) |
సిరామిక్ టెక్నాలజీ |
చీలు సునీల్ (నెల్లూరు) |
కెమికల్ |
గొలకోటి సాయి నాగరాజు (కొత్తపేట, కోనసీమ) |
సివిల్ |
మరడాన హేమంత్ (బలిజిపేట, విజయనగరం) |