Skip to main content

EAMCET 2022: ఈ కోర్సుల వైపే చూపు!.. ప్రధాన బ్రాంచీల్లో సీట్లు ఇలా..

Engineering Eamcet ఆప్షన్ల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది.
EAMCET 2022:
ఈ కోర్సుల వైపే చూపు!.. ప్రధాన బ్రాంచీల్లో సీట్లు ఇలా..

ఆగస్టు 24 రాత్రివరకు 58,807 మందికిపైగా కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3 లక్షలకుపైగా ఆప్షన్లను ఎంపిక చేసుకున్నట్టు Telangana State Technical Education విభాగం పేర్కొంది. ఒక విద్యార్థి గరిష్టంగా 1,013 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిపింది. సెప్టెంబర్‌ 2తో కౌన్సెలింగ్‌ గడువు ముగుస్తుంది. తొలిదశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 6న ఉంటుంది. మరోవైపు 8 వేల మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్నారు. చాలా మంది కుల, ఆదాయ ధ్రువపత్రాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

 AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)

తొలి ప్రాధాన్యత కంప్యూటర్‌ సైన్స్‌కే..

మొదటి విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యే సమ యానికి యూనివర్సిటీల నుంచి కాలేజీల అను బంధ గుర్తింపు జాబితా అందలేదు. దీంతో గతే డాది కౌన్సెలింగ్‌లో పెట్టిన 175 కాలేజీలనే ఈసా రి అప్‌లోడ్‌ చేశారు. వాటిలో 65,633 సీట్లు ఉన్న ట్టు చూపారు. ఈ సీట్ల సంఖ్యలో మా ర్పులు చేర్పులుండే వీలుందని అధికారులు అంటున్నా రు. ఇప్పటి వరకు విద్యార్థులు కంప్యూటర్‌ సై న్స్‌ ఇంజనీరింగ్, ఆర్టి ఫిషియల్‌ ఇంటెలి జెన్స్, సైబర్‌ సెక్యూ రిటీ, డేటా సైన్స్‌ వంటి కంప్యూటర్‌ కో ర్సులకే ఎక్కువగా ఆప్షన్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపా రు. 90% మంది తొ లి ప్రాధాన్యతగా సీ ఎస్‌సీ, ఇతర కంప్యూ టర్‌ కోర్సులనే ఎంచుకున్నారని.. తర్వా త ఎలక్ట్రానిక్స్, సివి ల్, మెకానికల్‌ కోర్సు లు ఉన్నా యని వివ రించారు. ఈసారి సీ ట్లు కూడా కంప్యూట ర్‌ కోర్సుల్లో పెరిగి, సివిల్, మెకానికల్‌ విభాగంలో తగ్గే అవకాశం ఉందని సమాచారం.

చదవండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

ప్రధాన బ్రాంచీల్లో సీట్లు ఇలా.. 

బ్రాంచ్‌

సీట్లు

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌సీ)

17,154

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

126

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌

1,176

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌

816

సైబర్‌ సెక్యూరిటీ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో కలిపి

126

కంప్యూటర్‌ సైన్స్‌ సైబర్‌ సెక్యూరిటీ

1,680

సీఎస్‌సీ డేటా సైన్స్‌

3,549

కంప్యూటర్‌ సైన్స్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌

252

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఏఐఎంఎల్‌)

7,032

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఐవోటీ)

735

కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌)

168

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ)

11,375

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (ఈఈఈ)

5,337

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)

4,692

సివిల్‌ ఇంజనీరింగ్‌

4,548

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

4,284

చదవండి: TS EAMCET 2022: కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు...

Published date : 25 Aug 2022 03:14PM

Photo Stories