ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఎమ్మెస్సీ బోటనీ, ఫిజిక్స్, ఎంఏ ఎకనామిక్స్ కోర్సుల పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 23న విడుదల చేశామని దూరవిద్య కేంద్రం పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జి.జాన్సన్ తెలిపారు.
రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించడానికి మార్చి ఏడు ఆఖరి తేదీగా నిర్ణయించామన్నారు. రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.960 చెల్లించాలన్నారు.
Published date : 24 Feb 2018 03:44PM