దూరవిద్యలో ఎం.ఫిల్, పీహెచ్‌డీలకు నో!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పరిశోధనలను దూర విద్య విధానంలో నిర్వహించడానికి వీల్లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అవార్డ్ ఆఫ్ ఎంఫిల్/పీహెచ్‌డీ డిగ్రీ రెగ్యులేషన్స్-2016 పేరుతో మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా డిగ్రీలకు చేపట్టాల్సిన ప్రవేశాల విధానం, పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతలు, డిగ్రీ ప్రదానంలో పాటించాల్సిన నిబంధనలను అందులో పొందుపరిచింది.
Published date : 23 Jul 2016 03:12PM