అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఎంట్రన్స్ గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రెండో విడత అర్హత పరీక్షకు రిజిస్ట్రేషన్ల గడువును ఈనెల 24 వరకు పొడిగించారు.
ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ మరికొన్ని రోజులు పొడిగించాలని అభ్యర్థులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 23న జరగాల్సిన అర్హత పరీక్షను.. 30న నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్ తెలిపారు.
Published date : 19 Aug 2015 03:07PM