అక్టోబర్‌లో ఓపెన్ స్కూల్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్‌త, ఇంటర్ పరీక్షలు అక్టోబర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకుడు వెంకటేశ్వరశర్మ జూలై 27న ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 1నుంచి 13 వరకు మీసేవ, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 20 వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 27వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు.
Published date : 28 Jul 2018 03:14PM