Hail Rain: వడగండ్లు ఎంత వేగంగా భూమికి చేరతాయంటే... అసలు ఇవి ఎలా ఏర్పడతాయో తెలుసా..!
గాలిలోని తేమపై ఆధారపడి...
వాతావరణంలోకి చేరే నీటి బిందువుల వల్ల వడగండ్లు ఏర్పడతాయి. పైకి వీచే బలమైన గాలుల వల్ల నీటి బిందువులు వాతావరణ పైపొరలకు చేరతాయి. అక్కడ వాతావరణం నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంటుంది. ఈ స్థితిలో నీటి బిందువులు మంచుగా మారతాయి. గాలిలోని తేమ, ఈ మంచు చుట్టూ పేరుకుపోతున్నకొద్దీ వీటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. వడగండ్ల పరిమాణం ఎంత వేగంగా పెరుగుతుందనేది గాలిలోని తేమపై ఆధారపడి ఉంటుంది. బలమైన గాలులు పైకి వీచేకొద్దీ వీటి పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. గాలి బలహీనపడినప్పుడు ఈ వడగండ్లు కిందపడతాయి.
చదవండి: టీసీఎస్ కొత్త సీఈఓ ఎవరంటే... ఆయన శాలరీ ఎన్ని కోట్లంటే...
అధిక ఉష్ణోగ్రతల వల్ల....
వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. అలాగే గాలిలోని తేమను కూడా వాతావారణ మార్పులు ప్రభావితం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భూమి ఉపరితలం నుంచి నీరు ఎక్కువగా ఆవిరవుతోంది. వెచ్చని గాలిలో ఎక్కువ నీటి ఆవిరి ఉంటుంది. ఎక్కువగా తేమ ఉండే గాలి, ఎక్కువ శక్తిమంతమైన గాలి ప్రవాహాల వల్ల పెద్దగా ఉండే వడగండ్లు ఏర్పడతాయి. భూగ్రహం వేడెక్కడం ఇలాగే కొనసాగితే వడగండ్లు తరచుగా కురిసే ప్రమాదం ఉంది.
చదవండి: ఇలా చేస్తే ఈజీగా విదేశీవిద్యను పూర్తి చేయొచ్చు... అయితే వీరికి మాత్రమే
చల్లటి గాలి వల్లే....
గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలు వడగండ్ల సాంద్రతపై ప్రభావం చూపిస్తాయి. చల్లటి గాలిలో నీటి బిందువులు చాలా త్వరగా వడగండ్లుగా మారతాయి. చల్లని గాలిని తాకగానే ఎక్కువ పరిమాణంలో ఉన్న తేమ మంచుగా మారదు. ఇందుకు కొంత సమయం పడుతుంది. అలాగే కొన్ని నీటి బిందువులు మంచుగా మారవు. పరిమాణంలో చిన్నగా ఉండే వడగండ్ల సాంద్రత దట్టంగా ఉండదు. దీంతో అవి వర్షంగా పడగానే వాతావరణంలో వేడిగాలి వర్ష చినుకులుగా మారతాయి. సాంద్రత ఎక్కువగా ఉన్న వండగండ్లు కూడా ఇలాగే కరుగుతూ కిందకి జారతాయి. అయితే నేలను తాకినప్పుడు ఉన్న పరిమాణం కంటే మేఘం నుంచి కురిసినప్పుడు వడగండ్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వడగండ్లు గంటకు సుమారు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో భూమిని చేరతాయి.