Skip to main content

ఫిలిప్పీన్స్‌కు ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన వెయిట్‌లిఫ్టర్‌?

97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... మహిళా వెయిట్‌లిఫ్టర్‌ హిదిలిన్‌ దియాజ్‌ ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో ఫిలిప్పీన్స్‌ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
Hidilyn Diaz
Hidilyn Diaz

టోక్యో ఒలింపిక్స్‌–2020లో భాగంగా... జపాన్‌ రాజధాని టోక్యోలో జూలై 26న జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 55 కేజీల విభాగంలో 30 ఏళ్ల దియాజ్‌ మొత్తం 224 కేజీల (స్నాచ్‌లో 97+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 127) బరువెత్తి కొత్త ఒలింపిక్‌ రికార్డును సృష్టించింది. దాంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. లియావో కియున్‌ (చైనా–223 కేజీలు) రజతం, జుల్ఫియా చిన్‌షాన్లో (కజకిస్తాన్‌–213 కేజీలు) కాంస్యం సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో దియాజ్‌ రజత పతకాన్ని సాధించింది. 1924 నుంచి ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంటున్న ఫిలిప్పీన్స్‌ ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు సాధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫిలిప్పీన్స్‌కు ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన వెయిట్‌లిఫ్టర్‌?
ఎప్పుడు    : జూలై 26
ఎవరు    : మహిళా వెయిట్‌లిఫ్టర్‌ హిదిలిన్‌ దియాజ్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
ఎందుకు    : టోక్యో ఒలింపిక్స్‌–2020లో భాగంగా... నిర్వహించిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచినందున...
 

Published date : 27 Jul 2021 06:27PM

Photo Stories