Skip to main content

Cricket: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీ టైటిల్‌ సొంతం చేసుకున్న జట్టు?

TamilnaduTeam

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌-2021లో డిఫెండింగ్‌ చాంపియన్‌ తమిళనాడు జట్టు విజేతగా అవతరించింది. న్యూఢిల్లీలో నవంబర్ 22న జరిగిన ఫైనల్లో తమిళనాడు జట్టు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. 

మూడుసార్లు గెలిచిన జట్టుగా… 
తాజా విజయంతో... ముస్తాక్‌ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్‌లో, 2020– 2021 సీజన్‌లోనూ తమిళనాడు చాంపియన్‌గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్‌ అలీ ట్రోఫీని సాధించాయి.

టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీలో హర్మన్‌కు చోటు..
భారత మహిళల టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు దక్కింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌) 2021 ఏడాది సీజన్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తున్న ఆమెకు లీగ్‌ అధికారిక ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ జాబితాలో చోటు దక్కింది. డబ్ల్యూబీబీఎల్‌ అధికారిక టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీలో ఒక్క హర్మన్‌ మినహా మరే భారత ప్లేయర్‌కు అవకాశం దక్కలేదు.


చ‌ద‌వండి: టాటా ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గి క్రీడాకారుడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌-2021లో టైటిల్ విజేత?
ఎప్పుడు : నవంబర్‌ 22
ఎవరు   :  తమిళనాడు జట్టు
ఎక్కడ     : న్యూఢిల్లీ
ఎందుకు : ఫైనల్లో తమిళనాడు జట్టు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించడంతో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Nov 2021 03:14PM

Photo Stories