Skip to main content

Asian Para Games: ఆసియా పారా క్రీడల జావెలిన్‌ త్రోలో పసిడి పతకాలు

ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్‌ ఖాతాలో 30 పతకాలు చేరాయి.
Sumit Antil wins gold in javelin Paralympics champion
Sumit Antil wins gold in javelin Paralympics champion

ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌64 కేటగిరీలో సుమిత్‌ అంటిల్‌ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్‌ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

National Games 2023: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో షేక్‌ గౌస్‌–పూజ జోడీకీ పసిడి పతకం

జావెలిన్‌ త్రో ఎఫ్‌46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్‌ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్‌ దినేశ్‌ ముదియన్‌సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్‌ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్‌37/38 జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో హనే... మహిళల టి47 లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. 

Asian Para Games 2023: పరుగులో దీప్తికి స్వర్ణ పతకం

Published date : 26 Oct 2023 12:44PM

Photo Stories